AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ నేత హరీశ్ వర్గీయులు వస్తుండగా కేతిరెడ్డి అనుచరులు వాహనాలు అడ్డుగా పెట్టారు. దీంతో కేతిరెడ్డి డ్రైవర్ను బీజేపీ కార్యర్తలు చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.