TG: హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్కు వెళుతున్నారు. అధికారులు తమ నివాసాలను ఎప్పుడు కూలుస్తారోనని నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని, బీఆర్ఎస్ పెద్దలకు తమ బాధలు చెప్పుకుంటామని వెళ్లడిస్తున్నారు.