మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణె ఎయిర్ పోర్టు పేరును ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఎయిర్పోర్ట్’గా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రిర్గం చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ విమానాశ్రయాన్ని లోహ్గావ్ విమానాశ్రయం అని పిలిచేవారు. ఇటీవల ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ లోహాగావ్ విమానాశ్రయం పేరును మారుస్తామని తెలిపారు.