వాయువ్య బంగాళాఖాతంలో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతోంది. పరదీప్ (ఒడిశా)కు 260 కిలోమీటర్ల దూరంలో.. ధమ్రా(ఒడిశా)కు 290 కిలోమీటర్ల దూరంలో.. సాగర్ ద్వీపానికి(బెంగాల్) 350 కి.మీ. దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమైంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంది.