తిరుమల శ్రీవారి దర్శనాల్లో ప్రోటోకాల్ వ్యవహారంపై తెలంగాణ MLA అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. APకి తెలంగాణ ఆస్తులు కావాలి.. కానీ, తిరుమలలో హక్కు లేదనడం ఏంటని ఆరోపించారు. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తిరుమలను కేటాయించారన్నారు. అటు మరో MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ విషయాన్ని CM దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.