ఢిల్లీ ఏపీ భవన్లో ఇవాళ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీపావళి సందర్భంగా ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 2 వరకు కొనసాగనుంది. దీనిద్వారా చేనేత వస్త్రాలు, కళాకృతుల.. ప్రదర్శన, అమ్మకాలు జరగనున్నాయి. ప్రత్యేక ఉత్పత్తులతో జిల్లాకు ఒక స్టాల్ చొప్పున ఏపీ సర్కార్ 21 స్టాళ్లు ఏర్పాటు చేసింది. మరికొన్ని స్టాల్స్‌లో తెలుగు వంటకాలను ప్రదర్శనకు ఉంచింది.