AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల డిక్లరేషన్‌పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.