TG: మహబూబ్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణకు 15 మంది అధికారులను నియమించింది. అనర్హులకు కేటాయింపులు జరిగినట్టు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు.