కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయన రాజీనామా చేయాలని 24మంది లిబరల్ సభ్యులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 28 వరకు డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారు. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినడానికి ట్రూడో వైఖరే కారణమని అందులో సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు.