AP: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో మరొకరికి చోటు లభించింది. బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డికి పాలకమండలిలో చోటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తం 25 మంది సభ్యులకు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించారు. ఇటీవల టీటీడీ పాలకమండలి చైర్మన్గా బీఆర్ నాయుడుని నియమించడంతో పాటు 24 మంది సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే.