ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ 21మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. ఝార్ఖండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఓరాన్, షిప్లి నేహా టిర్కీ మందార్ పేర్లు తొలిజాబితాలో ఉన్నాయి. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్‌కు నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్, 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, వామపక్షాలు సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చినట్లు సమాచారం.