TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ వయసులో జీవన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. నిత్యం ప్రజల మధ్యలో తిరిగే జీవన్ రెడ్డిని జగిత్యాలలో.. నన్ను సంగారెడ్డిలో ఎందుకు ఓడగొట్టారో అర్ధం కావడం లేదు. మీరు ఒంటరి అనుకోవద్దు.. మీ వెంట నేనుంటా’ అని పేర్కొన్నారు. కాగా, జీవన్ రెడ్డి అనుచరుడైన గంగారెడ్డి ఇటీవల హత్యకు గురయ్యారు.