AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జలతరంగిణి జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతయ్యారు. మొదట జలపాతంలో ఐదుగురు MBBS విద్యార్థులు కొట్టుకుపోయారు. స్థానికులు ఇద్దరినీ కాపాడగా.. మరో ముగ్గురు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నట్లు గుర్తించారు. కాగా, గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.