AP: వైసీపీ అధినేత జగన్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. ఆస్తి కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని కోర్టులో పెట్టిన నువ్వు మనిషివా జగన్? అని ప్రశ్నించారు. ‘నీ తండ్రి పోటీ చేసినప్పుడు నీకు సొంత ఇల్లు కూడా లేదు. అలాంటిది అన్ని ఆస్తులు ఎలా సంపాదించావు? రాళ్లు కొట్టి సంపాదించావా? వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించావు కదా.. ఇంతవరకు చెక్కులు పంపిణీ చేయలేదెందుకు?’ అని అడిగారు.