భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దీనిని ‘‘భారతీయ ఆంత్రిక్ష్ స్టేషన్’’ అని పిలుస్తామన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) , బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) మధ్య బయోటెక్నాలజీని, స్పేస్ టెక్నాలజీలో అనుసంధానం చేయడంతో భాగంగా జరిగిన కీలకమైన ఒప్పందంలో సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.