ఎడిబుల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. గత నెలలో పామాయిల్ ధరలు 37% పెరిగాయి. అదే సమయంలో గృహాలలో ఉపయోగించే ఆవనూనె ధరలు కూడా 29% పెరిగాయి. సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల గరిష్ట స్థాయి 5.5%కి చేరిన సమయంలో చమురు ధరలలో ఈ పెరుగుదల వచ్చింది. గత నెలలో ప్రభుత్వం ముడి సోయాబీన్, పామ్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరిగాయి.