AP: ఐదు గిన్నిస్ రికార్డులతో అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ధ్రువపత్రాలు అందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టికి రికార్డులు లభించాయి. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డు, డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో రికార్డు, ఏరియల్ లోగోతో ఈ డ్రోన్ షో ఐదో రికార్డు నెలకొల్పంది.