ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఒక వాలంటీర్ల బృందానికి అరుదైన వస్తువు దొరికింది. ఈ బృందం తవ్వకాలు జరుపుతుండగా 200 ఏళ్ల క్రితం నాటి ఓ గాజు సీసా బయటపడింది. ఆ గాజు సీసాలో ఓ లేఖ కూడా ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు ఆ లేఖలో ఉన్నాయి. పీజే ఫెరెట్ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త జనవరి 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్టు ఈ లేఖలో ఉంది.