TG: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిందంతా రేవు పార్టీలేనని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. యువకులను మత్తుకు బానిసలుగా చేశారన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య తెలంగాణ, స్పోర్ట్స్ తెలంగాణ కావాలనే పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తుంటే కేటీఆర్ బావమర్ది డ్రగ్స్ వ్యవహారం నడిపిస్తున్నారని పేర్కొన్నారు.