కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్దీప్ సింగ్ దాలా సన్నిహిత అనుచరుడు బల్జీత్ సింగ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. యూఏఈ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేటీఎఫ్ కోసం భారత్లో యువకులను రిక్రూట్ చేయడం, వారికి వనరులను సమకూర్చడం వంటి పనులన్నీ సింగ్ చేస్తుండేవాడని వెల్లడించారు.