క్రిప్టో కరెన్సీతో ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు పొంచి ఉందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టో వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై కేంద్ర బ్యాంక్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ కరెన్సీల గురించి ప్రశ్నల్ని లేవనెత్తిన మొదటి దేశం భారత్ అని పేర్కొన్నారు. క్రిప్టోతో కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యపై అంతర్జాతీయ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.