ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని నివారించేందుకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ను కనిపెట్టారు. ఈ. కొలి బ్యాక్టీరియాను మార్చి వ్యాక్సిన్లో ఉపయోగించినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ కణాలను పోలి ఉండి వాటిని గుర్తించి వాటిపై దాడి చేసేందుకు ఈ ప్రొబయోటిక్ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుందని వెల్లడించారు.