TG: గ్రూప్-1 విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని, ఆ మైండ్ సెట్‌తో ఎల్లుండి పరీక్ష ఎలా రాస్తారని పేర్కొన్నారు. మహిళలను, గర్భిణీలను కొడుతున్నారు.. ఇది దాష్టీకానికి నిదర్శనమన్నారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు.. వారి ఆందోళనకు సంబంధం లేదన్నారు.