AP: కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈనెల 11నుంచి అసెంబ్లీలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దీంతో పాటు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై స్పెషల్ ఫోకస్ చేయనుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపైనా మంత్రివర్గం చర్చించనుంది. విజన్-2047, కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీ కండక్టర్, డాటా సెంటర్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనుంది.