కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపణలు చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టోహానాలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తప్పుబట్టారు. కోటాను రక్షించగల నేత ఎవరైనా ఉన్నారంటే.. అది ప్రధాని మోదీ మాత్రమేనని వ్యాఖ్యానించారు.