TG: అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీకి జీవన్ రెడ్డి లేఖ రాసినట్లు తెలిపారు.