TG: మెదక్, సిద్దిపేట కలెక్టర్లపై బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు హాజరుకాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ఇరువురి కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్లు బాధ్యతను గుర్తించాలని.. ఇకపై జరిగే బహిరంగ విచారణకు హాజరుకావాలని సూచించారు.