TG: కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టారని మాజీ మంత్రి KTR ఆరోపించారు. కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని రేవంత్ వ్యతిరేకించారని, ఇప్పుడు కొడంగల్‌లోనే ఏర్పాటుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ మాకొద్దని స్థానికులు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రులు విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.