APDPMS పోర్టల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. సర్వర్, డేటా బదలాయింపులో భాగంగా నవంబర్ 4 వరకు DPMS సేవలు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు. ప్రస్థుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఉన్న డేటాను స్టేట్ డేటా సెంటర్‌కు బదలాయిస్తున్నామని తెలిపారు. మైగ్రేషన్‌లో భాగంగానే వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నామని, వెబ్సైట్ అందుబాటులోకి రాగానే యథావిధిగా భవనాలు, లేఔట్లకు అనుమతులిస్తామని వెల్లడించారు.