TG: మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరగటంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయం ఎదుట నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గర్భాలయాన్ని మూసివేసి రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలకు ఏడుపాయల వనదుర్గ ఆలయం మాటిమాటికీ మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.