TG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో ఇవాళ జీఎం అరుణ్ భేటీ కానున్నారు. హైదరాబాద్ రైల్ నిలయంలో ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్ సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ROBలు, అండర్‌పాస్‌ల సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొననున్నారు.