TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. MGNREGS అమలుపై సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రణాళిక బద్ధంగా పనులు చేయించాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా, ఉపాధి హామీ నిధులతో వ్యవసాయ అనుబంధ పనులకు ప్రధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.