శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోజంతా కేలరీలు బర్న్ అవుతాయట. మానసిక స్థితి మెరుపడి ఉల్లాసంగా ఉంటారు. శరీరం దృఢంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయం కుదరకపోతే సాయంత్రం వ్యాయామం చేసినా మంచి ఫలితం ఉంటుంది.