జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దాడులను అరికట్టేందుకు ఇండియాన్ ఆర్మీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది. దాడి చేసిన వారికి సరిహద్దు అవతల నుంచి మద్దతు లభిస్తుందనే అనుమానాల దృష్ట్యా సైన్యం తమ వ్యూహాలపై పునరాలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారు అనుసరించాలనుకుంటున్న కార్యచరణను చెప్పలేనప్పటికీ.. ఉద్భవిస్తున్న బెదిరింపులను ఎదుర్కోవడానికి వ్యూహాలను సర్దుబాటు చేస్తున్నట్లు ఆర్మీ వెల్లడించింది.