AP: వరద బాధితులకు పరిహారం చెల్లింపుపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే నష్టం అంచనా ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈనెల 25న వరద బాధితులకు పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కాగా విజయవాడలో భారీ వరదలకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ. 25వేలు, మొదటి అంతస్తు, ఆపై అంతస్తుల వారికి రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.