TG: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీ, పంచాయతీరాజ్ సంయుక్త సహకారంతో కసరత్తు చేస్తున్నారు. వాటి అనుభవాల ఆధారంగా మరిన్ని గ్రామాలకు విస్తరించనున్నట్లు సమాచారం.