AP: కడప జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థినిపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్థానిక అధికారులతో మాట్లాడారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో ఎస్పీ సూచనల మేరకు స్థానిక పోలీసు అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.