ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇటీవల మిస్సైల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాలు, మిస్సైల్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడింది. కాగా ఈ దాడులు 1981లో చేసిన ‘ఆపరేషన్ ఒపేరా’ను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో శత్రుదేశాల కళ్లుగప్పి దాదాపు 2వేల కి.మీ దూరంలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్‌ను ధ్వంసం చేసింది. ఇప్పుడు కూడా అదే రీతిలో దాడులు చేయడం గమనార్హం.