AP: అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు తేదీ ఖరారు అయింది. ఈనెల 11న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను గవర్నర్ అబ్దుల్ నజీర్ విడుదల చేశారు. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఏన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై BAC సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.