AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్లో తెలిపారు.