అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య హోరాహోరీ నెలకొంది. అయితే కమలా హారిస్ అనూహ్యంగా దూసుకొచ్చారు. ఆమె ఇప్పటివరకు 205 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. కాగా.. 230 ఎలక్టోరల్ సీట్లతో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.