TG: రాష్ట్ర ప్రభుత్వానికి BC రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని BJP MLA ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. కులగణనకు BJP వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ లబ్ధికోసమే కులగణన చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డిలో BC డిక్లరేషన్లో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా..? 42 శాతం రిజర్వేషన్లు BCలకు ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవుల్లో ఎంతమంది BC మంత్రులున్నారో సీఎం చెప్పగలరా..? అని మండిపడ్డారు.