అన్నమయ్య: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, బకాయిలు చెల్లించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులతో ర్యాలీగా బయలుదేరి అన్నమయ్య కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నరసింహ విద్యా, వసతి దీవెన బకాయిలు రూ.3,480 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో ఇబ్బందులు పడుతున్నారన్నారు.