TG: హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ‘భారత్లోనే కులవివక్ష ఉందని రాహుల్ గాంధీ అన్నారు. కుల వివక్ష పోగొట్టడానికే కులగణన సర్వే చేపట్టాం. రాహుల్ కులంతో బీజేపీకి ఏం పని?.. రాహుల్ కులం తెలియాలంటే దేశ కులగణన చేయాలి. అప్పుడే తన కులం ఏంటో రాహుల్ చెప్తారు. మతతత్వ రాజకీయాలు చేయడమే బీజేపీ పని’ అని అన్నారు.