అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని అతిపెద్ద జిల్లాకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2003లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 2007-11 వరకు, ఆ తర్వాత 2019-23 వరకు హౌస్ స్పీకర్గా వ్యవహరించారు.