AP: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌పై తళ్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. 341, 353, 390 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దౌర్జన్యం, ASIపై దాడితోపాటు ఓ దాబాపై దాడి ఘటనలకు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అనిల్‌ను తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.