చాలామందికి పాదాలు, కాళ్ల వద్ద చర్మం త్వరగా పొడిబారుతుంది. శీతాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ పొడి, రోజ్‌వాటర్ కలిపి పాదాలపై మర్దనా చేయాలి. ఆరిన తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి లేదా బాదం నూనెతో మర్దనా చేసుకోవాలి. దీంతో చర్మానికి తేమ అంది మృదువుగా మారతాయి.