మరికొద్ది రోజుల్లో జరిగే IPL మెగా వేలంలో భారత స్టార్ ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశం ఉంది. వీరిని తమ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోకపోవడంతో వేలంలోకి రానున్నారు. వీరిలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, చాహల్, షమీ, ఇషాన్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, సుందర్ తమ బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా రూ. 75 లక్షలుగా నిర్ణయించుకున్నారు.