AP: వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, ఇవాళ తెల్లవారుజామున 41ఏ నోటీసు ఇచ్చి రవీందర్ రెడ్డిని పోలీసులు వదిలేశారు. దీంతో పోలీసులపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారక తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మరో కేసులో రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసుల రాకను గమనించి రవీందర్ రెడ్డి పరారైనట్లు తెలుస్తోంది.