ASR: డుంబ్రిగుడ మండల అరకు బురదగడ్డ మలుపు వద్ద తుప్పలు పెరిగిపోయి ప్రమాదకరంగా తయారయింది. తుప్పలు పెరిగిపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనచోదులు చెబుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి జంగిల్ క్లియర్తో పాటు రహదారిలో సిగ్నల్ ఏర్పాటు చేయాలని వాహన చోదకులు, స్థానికులు కోరుతున్నారు.